VZM: ఈ నెల 16న ఎల్.కోట మండలంలోని సీతారాంపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసిన కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ ఆర్.గోవిందరావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ కార్యకర్తలు టీ.అనిల్, అతని స్నేహితుడు జే.రవిచంద్ర 16న అర్ధరాత్రి ధ్వంసం చేశారు. ముక్కాకిషోర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.