W.G: తణుకు పట్టణంలోనే ఒక టీ కార్నర్లో ఇవాళ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సొసైటీ రోడ్డులోని మమత టీ కార్నర్లో గ్యాస్ సిలిండర్ లీకైన ఘటనలో టీ మాస్టర్‌తో సహా టీ తాగేందుకు వచ్చిన ఐదుగురు మున్సిపల్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.