‘లాలో- కృష్ణ సదా సహాయతే’ అనే సినిమా 23 మంది ప్రాణాలను కాపాడిందని ఆ చిత్ర దర్శకుడు అంకిత్ సఖియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా చూసిన తర్వాత తాము ఆత్మహత్య ఆలోచనలను విరమించుకున్నామని 23 మంది స్వయంగా తనతో చెప్పారని ఆయన వెల్లడించాడు. ఈ చిత్రం తమ బాధలను పోగొట్టిందని, తమ జీవితానికి ఎంతగానో కనెక్ట్ అయ్యిందని ప్రేక్షకులు చెప్పినట్లు అంకిత్ పేర్కొన్నాడు.