MBNR: కార్పొరేషన్ ఎన్నికలలో డివిజన్ల కేటాయింపులో ఎస్టీలకు అన్యాయం జరిగిందని గిరిజన విద్యార్థి, సేవా సంఘం నేతలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగం కల్పించిన 10% రిజర్వేషన్ల ప్రకారం 6 స్థానాలు కేటాయించాల్సింది 2 స్థానాలనే కేటాయించారని పిటిషన్లో పేర్కొన్నారు. పిటీషన్ దాఖలుచేసిన వారిలో రవి రాథోడ్, రమేష్ నాయక్, కిషన్ పవర్లు ఉన్నారు.