MNCL: మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమౌతుంది. దానికి అనుగుణంగానే జిల్లాలో వార్డుల వారీగా రిజర్వేషన్లును ప్రకటించిన విషయం విధితమే. వార్డుపై ఆశలు పెట్టుకున్న వారి ఆశలను లక్కీడిప్ ఆవిరి చేసింది. రిజర్వేషన్లు తారుమారు కావడంతో గెలిచే గుర్రం రెడీగా ఉన్నా పరిగెత్తే దారే రిజర్వ్ అయిందంటూ.. ఆశావాహులు ఆవేదన చెందుతున్నారు. వార్డు మారింది.. అదృష్టం గల్లంతైంది అంటూ వాపోతున్నారు.