NLR: ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు పంచాయతీలోని స్మశాన వాటికను డంపింగ్ యార్డ్‌గా మార్చారు అంటూ బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి నాగేంద్రబాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. సరైన డంపింగ్ యార్డ్ లేకపోవడంతో చెత్తను స్మశానంలో వేస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.