GNTR: పెదకాకాని గ్రంథాలయంలో యోగి వేమన జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. గ్రంథాలయాధికారి నంద్యాల నాగిరెడ్డి వేమన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన్ని గొప్ప ప్రజాకవిగా, సంఘ సంస్కర్తగా కొనియాడారు. పద్యాల ద్వారా మూఢనమ్మకాలను ఖండించిన వేమన సమాజానికి మార్గదర్శకుడని పేర్కొన్నారు.