AP: అన్నమయ్య(D) బండవడ్డీపల్లిలో నకిలీ మద్యం వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరణించారన్న ఆరోపణలను ఏపీ ఫాక్ట్ చెక్ కొట్టివేసింది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆరుగురు స్నేహితులు మద్యం తాగారని, అందులో మణికుమార్, పుష్పరాజ్ పోటీపడి 19 బీర్లు తాగినట్లు వెల్లడించింది. దీంతో వారు తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై మరణించారని స్పష్టం చేసింది. రాజకీయ ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొంది.