కరీంనగర్ అశోక్ నగర్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో మంగళవారం వాసవి మాత ఆత్మార్పణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 7:30 గంటల నుంచి భక్తులచే స్వయంగా మూలవిరాటు క్షీరాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ తెలిపారు. అనంతరం గణపతి పూజ, కలశ స్థాపన, హోమం జరుగుతాయన్నారు.