SRCL: ప్రజావాణి ద్వారా వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి మొత్తం 109 దరఖాస్తులు స్వీకరించి, వాటిని సంబంధిత అధికారులకు పంపించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.