KRNL: సమాచార హక్కు చట్టం-2005 జిల్లా జనరల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన కె. సుందర్రాజును జిల్లా అధ్యక్షులు కిషోర్ ఇవాళ నియమించారు. ఈ సందర్భంగా సుందర్రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారాన్ని పొందే హక్కు ప్రతి భారత పౌరుడికి చట్టబద్ధంగా కల్పించబడిందన్నారు. అవినీతిని అరికట్టి పాలనలో పారదర్శకత, జవాబుదారితనం పెంచడంలో ఆర్టీఐ చట్టం కీలకమన్నారు.