NZB: గ్రామీణస్థాయిలో క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్ర, జాతీయస్థాయిల్లో రాణించాలని సర్పంచ్ లావణ్య భూమేశ్వర్ అన్నారు. ముప్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామంలో సీఎం కప్లో భాగంగా క్రీడాపోటీలను సర్పంచ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత చెడుఅలవాట్లను దూరంగా ఉండేందుకు క్రీడలవైపు మొగ్గు చూపాలన్నారు.