TG: రాష్ట్రంలో నాలుగు లక్షల ఇళ్లను ఒకేసారి మంజూరు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నామని ఉద్ఘాటించారు. రైతు రుణమాఫీ చేశామని, రైతు భరోసా ఇస్తున్నామని చెప్పారు. ఎన్నికల ప్రచారం చెప్పినట్లు రాష్ట్ర సంపదనను ప్రజలకు పంచుతున్నామన్నారు. ఇదీ ప్రజాసంక్షేమం అంటే అని అన్నారు.