టాటా ముంబై మారథాన్‌లో పురుషుల ఎలైట్, మహిళల ఎలైట్‌లో ఇథియోపియా అథ్లెట్లు విజేతగా నిలిచారు. అబేట్ 2 గంటల 9 నిమిషాల 55 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలిచాడు. మహిళల విభాగంలో యేషి 2 గంటల 25 నిమిషాల 13 సెకన్లలో లక్ష్యాన్ని అందుకుని తొలి స్థానంలో నిలిచింది. భారత్ నుంచి పురుషుల విభాగంలో కార్తిక్ (2:19.55), మహిళల విభాగంలో సంజీవని (2:49.02) టాప్‌లో నిలిచారు.