TG: న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు దేవాలయం ప్రాంగణంలో సాయి దత్త పీఠం అండ్ సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్-నారీ శక్తి కార్యక్రమం ఉత్తేజకరంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సనాతన ధర్మ పరిరక్షకురాలు, బీజేపీ నేత మాధవీలత హాజరయ్యారు. వ్యక్తులను, సమాజాన్ని బలోపేతం చేసే శాశ్వత సూత్రాలను సనాతన ధర్మం అందిస్తుందని ఆమె పేర్కొన్నారు.