ADB: నార్నూర్ మండలం ఖైర్డాట్వ గ్రామంలోనీ ఇప్పపువ్వు లడ్డు తయారీ కేంద్రం సభ్యురాలి పెందోర్ శాంతాబాయికు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నుంచి గణతంత్ర దినోత్సవానికి ఆహ్వాన పత్రం వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వారిని సోమవారం ఆదివాసీ అనుబంధ సంఘాల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గిరిజన లడ్డు కేంద్రాన్ని రాష్ట్రపతి ఆహ్వానించడం గర్వంగా ఉందన్నారు.