NTR: పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలో సోమవారం ఘనంగా యోగివేమన జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ రాజశేఖర బాబు పాల్గొని అయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. యోగివేమన తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడని పేర్కొన్నారు. వేమన పద్యాలు వినని, తెలియని వారు లేరనడంలో అతిశయోక్తి లేదని పేర్కొన్నారు.