NRML: పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల సన్నద్ధతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం మాట్లాడుతూ.. మండల ప్రత్యేక అధికారులు తరచుగా ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సూచించారు. విద్యార్థుల చదువు, పరీక్షల సన్నద్ధతను సమీక్షిస్తూ అవసరమైన మార్గనిర్దేశం చేసి ఉత్తమ ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.