ATP: శింగనమల నియోజకవర్గంలోని పలువురు పేదలకు ఎమ్మెల్యే బండారు శ్రావణి సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం రూ. 41,38,733 విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలకు ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తాయని పేర్కొన్నారు.