ఉయ్యూరులో జనవరి 28న ప్రారంభం కానున్న శ్రీ పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్లకు సోమవారం అంకురార్పణ జరిగింది. ప్రతి రెండేళ్లకోసారి వచ్చే సంప్రదాయం ప్రకారం, అమ్మవారి విగ్రహాన్ని పల్లకిలో బందర్ తీసుకెళ్లి రంగుల పూత కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేష వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.