CTR: సోమల మండలం పగడాల వారి పల్లెలో సోమవారం పశువైద్య శిబిరం నిర్వహించినట్టు డాక్టర్ చందన ప్రియ తెలిపారు. ఈ శిబిరంలో 156 పశువులకు పిడుదల మందు పిచికారి, 80 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్టు ఆమె వెల్లడించారు. గర్భకోశ వ్యాధి సమస్య ఉన్న 17 పశువులకు చికిత్స అందించామన్నారు. నట్టల నివారణ మందు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.