NDL: మహానందిలో జరగనున్న మహాశివరాత్రి ఏర్పాట్లపై ఈ నెల 23న నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో మొదటి కో ఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సోమవారం అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై చర్చించనున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన చర్యలు, కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చిస్తారు.