ప్రకాశం: తర్లుపాడు మండలం తాడివారిపల్లి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పశు వైద్యాధికారి డా. విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పాడి రైతులు, సన్నజీవాల కాపరులు తమ జీవాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లేగ దూడలు, పశువులు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు తాగించారు.