GNTR: చేబ్రోలు మండలం నారాకోడూరులో భూ సమస్యకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర పరిష్కారం చూపారు. సర్వే నం.288లోని 11.80 ఎకరాలను 22-A నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఐదేళ్లుగా తిరుగుతున్నా పని కాలేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఆయన వెంటనే కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. సోమవారం ఆ ఆర్డర్ కాపీలను రైతులకు అందజేశారు.