TG: హైదరాబాద్లో మహిళల భద్రతకు మహిళా పోలీస్ విభాగం చర్యలు చేపడుతోంది. డిసెంబర్లో 98 ఫిర్యాదులను షీ టీమ్ పోలీసులు స్వీకరించగా.. 29 కేసులను పోలీస్ స్టేషన్లకు సిఫార్సు చేశారు. 13 మంది నిందితులను అరెస్టు చేశారు. ఏడుగురికి కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. ఒక్క నెలలో 9 పిటీ కేసులు నమోదు చేశారు.