VSP: ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుకు నిర్ణీత గడువులో సరైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం పీజీఆర్ఎస్లో 172 వినతులు స్వీకరించగా, రెవెన్యూ 63, జీవీఎంసీ 48, పోలీస్ 7, ఇతర శాఖలవి 54 ఉన్నాయన్నారు. పునరావృత వినతులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.