RR: చౌదరిగూడ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఫిబ్రవరి మూడవ తేదీన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డిని నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీఎల్ చౌదరిగూడ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటుకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి టోర్నమెంటులతో యువతలోని ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు.