AP: రాజమండ్రి RTC బస్టాండ్లో విజయవాడ, విశాఖ వైపు బస్సులు లేవంటూ ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీనిపై మంత్రి మండిపల్లి స్పందించారు. విజయవాడ, విశాఖకు అదనపు బస్సులు ఏర్పాటు చేశామని మంత్రికి అధికారులు వివరించారు. ఇవాళ సాయంత్రం 10 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ, విశాఖ, HYD వెళ్లే వారికి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.