E.G: నిడదవోలు రూరల్ మండలం తాళ్లపాలెంలో మంత్రి కందుల దుర్గేష్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా నాబార్డు నిధులు రూ.147.50 లక్షలతో నిర్మించిన సింగవరం – తాళ్లపాలెం రహదారి పనులను పరిశీలించి, రోడ్డు నిర్మాణంలో పాటించిన నాణ్యతా ప్రమాణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో రూ. 25 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు.