SKLM: నేర ప్రవృత్తికి స్వస్తి పలకి, సత్ప్రవర్తనతో నడుచుకోవాలి అని కొత్తూరు ఎస్సై వెంకటేష్ అన్నారు. ఆదివారం సాయంత్రం పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లు లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఘర్షణలుకు దూరంగా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాలతో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.