ATP: సంక్రాంతి సెలవులు ముగియడంతో, ప్రయాణికులు తమ సొంతూళ్ల నుంచి నగరాలకు తిరిగి వెళ్లడం వల్ల బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. సోమవారం గుత్తి ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. మరోపక్క సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. సమయానికి బస్సులు రాకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.