NZB: జిల్లాలో వన్యప్రాణుల గణన ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ గణనలో పులులు, చిరుతలు, జింకలు, నెమళ్లు, అడవి పందులు తదితర వన్యప్రాణుల సంఖ్యను లెక్కించనున్నారు. సిరకొండ, కమ్మర్పల్లి, ఇందల్వాయి, వర్ని, ఆర్మూర్, నిజామాబాద్ రేంజ్ పరిధిలో ఈ గణన చేపట్టనున్నారు. అటవీ సంరక్షణ, భద్రత చర్యలు మరింత బలోపేతం చేయనున్నారు.