MLG: మేడారంలో CM అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మేడారం జాతర ప్రాంగణంలో శాశ్వత భవనాల నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.