TG: అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రజలతో ఛీకొట్టించుకుంటుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రతి కార్యకర్త ప్రతి ఒటర్ ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థించాలని సూచించారు. బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పని అయిపోయిందన్నారు.