KRNL: మంత్రాలయం మండలం మాధవరంలో సోమవారం TDP ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి చేతుల మీదుగా 1962 ఉచిత పశు అంబులెన్సును ప్రారంభించారు. మంత్రాలయం, పెద్దకడబూరు మండలాల్లో పశుపోషక రైతులకు సులభంగా సేవలు అందించడమే లక్ష్యంగా ఈ అంబులెన్స్‌ను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సేవలను పశు యజమానులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.