KNR: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం కరీంనగర్లో కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కేంద్రం కార్మిక చట్టాలను నీరుగారుస్తోందని మండిపడ్డారు.