W.G: తాడేపల్లిగూడెం పోస్టల్ డివిజన్ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో ఇవాళ నుంచి డిజిటల్ సేవలు ప్రారంభమయ్యాయి. నగదు రహిత లావాదేవీల ద్వారా సేవల్లో వేగం, పారదర్శకత పెరుగుతుందని సూపరింటెండెంట్ ముత్యాల శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు ఈ ఆధునిక సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు. డిజిటల్ సేవలతో వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు.