BDK: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కోరారు. సోమవారం కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన బాకీ కార్డు ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. 25 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు పడ్డ బాకీని ప్రతి ఒక్కరికి వివరించాలని చెప్పారు.