TG: ఖమ్మం సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మందుల సామేల్.. సమాజానికి కమ్యూనిస్టుల అవసరం ఎంతో ఉందని కొనియాడారు. తన తండ్రి, సోదరుడు కమ్యూనిస్టులని, వారి వారసుడిగానే ఈ సభకు వచ్చానని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా పోరాడే కమ్యూనిస్టులు లేని రాజ్యాన్ని ఊహించుకోలేమని అన్నారు. వారు సమాజానికి అనివార్యమని పేర్కొన్నారు.