KMM: వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన రూ. 100 కోట్ల నిధులపై సీఎం పర్యటన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. గతేడాది ఆగస్టు 15న ప్రకటించిన ఈ నిధుల కోసం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రతిపాదనలు పంపినా, ఇంకా అనుమతులు రాలేదు. నేడు ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో వైరా వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.