VKB: నవాబుపేట మండలం మినేపల్లి కలాన్ గ్రామంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించారు. మద్యం అమ్మితే లక్ష జరిమానా విధించారు. అమ్మిన వారిని పట్టిస్తే పదివేల బహుమతిగా ప్రకటించారు. ఈ విషయాన్ని తూచా తప్పకుండా పాటించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు గ్రామస్తులు ఏకమై తీర్మానించారు. ఇవాళ నుంచే అమలు చేస్తున్నామని ప్రకటించారు.