BPT: అద్దంకి మండలం నాగులపాడు గ్రామానికి చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు. పట్టణంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆమె, ఈనెల 12న డ్యూటీకి వెళ్లి తిరిగి రాలేదు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఆచూకీ కోసం గాలిస్తున్నామని, సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలని సీఐ కోరారు.