పక్కవారిని చూసి అసూయపడేవాడు, అందరినీ అసహ్యించుకునేవాడు, ఉన్నదానితో సంతృప్తి చెందనివాడు, చిన్నదానికి కోప్పడేవాడు, ప్రతిదానిని అనుమానించేవాడు, ఇతరుల సంపాదనపై ఆధారపడి బతికేవాడు.. ఈ ఆరుగురు జీవితంలో ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. వీరికి మనశ్శాంతి అస్సలు ఉండదు. అందుకే ఆనందంగా జీవించాలంటే ఈ ఆరు దుర్గుణాలకు దూరంగా ఉండాలని విదురుడు స్పష్టం చేశాడు.