కడప: నగరంలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే శ్రీకృష్ణ దేవరాయలు జయంతి ఈసారి నిశ్శబ్దంగా ముగిసింది. రాజకీయ పార్టీలకు చెందిన బలిజ శ్రేణులు కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో స్తబ్ధత నెలకొంది. జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని గతంలో డిమాండ్ చేసిన నేతలు కూడా హాజరుకాలేదు. కాగా అభిమానులు, కొందరు యాదవులు, బీజేపీ రాష్ట్ర నేత బాలకృష్ణ యాదవ్ మాత్రమే నివాళులు అర్పించారు.