ELR: తెలుగు వారి ఆత్మగౌరవానికి చిరస్థాయిగా నిలిచిన మహానాయకుడు అన్న ఎన్టీఆర్ అని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అన్నారు. ఆదివారం ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.