KMM: వృత్తిరీత్యా కానిస్టేబుల్ అయినా అద్భుత కళాకారుడైన దాసరి విక్రమ్ ఖమ్మం సీపీ సునీల్ దత్ పెన్సిల్ స్కెచ్‌ను గీసి ఆయనకు ఆదివారం బహుకరించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్త బెటాలియన్ల గోడలపై పోలీసుల సాహసాలను పెయింటింగ్స్‌గా మలచిన విక్రమ్ ప్రతిభను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో ఉంటూనే కళా రంగంలో రాణిస్తున్న విక్రమ్‌ను పలువురు ప్రశంసించారు.