WG: మాజీ సీఎం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంస్కరణలు నేటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయని మంత్రి రామానాయుడు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. రూ.2కే కిలో బియ్యం, పక్కా గృహాలు, మహిళలకు ఆస్తిలో హక్కు, బీసీలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఎన్టీఆర్ వల్లే సాధ్యం అన్నారు.