RR: సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హననానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సోమవారం షాద్ నగర్ డీసీపీ శిరీష అన్నారు. యువత సోషల్ మీడియా బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, యువత డ్రగ్స్, మద్యానికి, గంజాయికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయిపై నిఘా పెట్టి ఎక్కడికక్కడ తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.