ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏదులాపురం మున్సిపాలిటీపై పట్టు సాధించడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గుర్రాలపాడుకి చెందిన బీఆర్ఎస్ కీలక నేత బుర్ర మహేష్ తన అనుచరులతో కలిసి ఆదివారం ఖమ్మంలో మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.