VZM: ఈనెల 21న విజయనగరంలోని పూల్ భాగ్ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో YCP జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.